శోభకృత్ నామ సంవత్సరం చైత్ర మాసం అమావాస్య ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి గురువారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శివుడిని పూజించాలి.
వృషభం: కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆందోళనలోకి నెడుతాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గో సేవ చేస్తే మేలు జరుగుతుంది.
మిథునం: కొత్త పనులకు ప్రణాళికలు రూపొందిస్తారు. శుభవార్తలు వింటారు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. దుర్గా స్తుతి పఠించాలి.
కర్కాటకం:ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీ నిజాయితీ, ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. వెంకటేశ్వర్ స్వామిని దర్శించుకోవాలి.
సింహం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. క్రీడాకారులు, రాజకీయ నాయకులకు మానసిక ఆందోళన ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకుండా వాయిదా వేసుకోవాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి.
కన్య:అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వైరాగ్యాన్ని దగ్గరకు చేరనీయకండి. చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. సాయిబాబా నామస్మరణ చేయాలి.
తుల: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. సహనం పెంచుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయాలి.
వృశ్చికం:స్వల్పంగా ధన లాభం ఉంటుంది. మానసిక సంతోషం లభిస్తుంది. వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. అష్టలక్ష్మి స్తుతి చేయాలి.
ధనుస్సు:పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు మేలు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. శని శ్లోకం పఠనం చేయాలి.
మకరం: కుటుంబసభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. రుణబాధలు తొలగి.. శత్రుబాధలు ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రణాళికగా సాగితే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి ధ్యానం చేయాలి.
కుంభం: చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్ర విరోధాలపై జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన ఉంటుంది. సూర్య అష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.
మీనం:కొంత ఆటంకాలు ఏర్పడతాయి. విందు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. మీకు ఇబ్బంది పెట్టే వారిని దూరంగా ఉంచాలి. లింగాష్టకం పారాయణం చేయాలి.