మేషం
మీకు ఉద్యోగం, వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. ఎదుటివారి గురించి మంచిగా ఆలోచించండి.ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. బంధు, మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
వృషభం
ఈ రాశివారు ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యతనివ్వలేరు. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు.సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్ధులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు పొందవచ్చు.సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
కర్కాటకం
కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ముఖ్యమైన పనులను ఆలస్యం చేయవద్దు. పెద్ద భాగస్వామ్యంలో ఒప్పందం కుదుర్చుకోవచ్చు.విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహం
మీకు ఆర్థిక పరంగా ఈరోజు బావుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఏ బంధాన్ని దుర్వినియోగం చేయవద్దు. మాట్లాడే సమయంలో నియంత్రణలో ఉండాలి. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు.
కన్య
మీపై మీరు పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంటారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
తుల
మీ పనికి నూతన రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.స్నేహితుల సహకారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.
వృశ్చికం
ఈ రోజు మీరు శుభ వార్తా వింటారు. ఆరోగ్యం బావుంటుంది. ప్రతిభ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక సంబంధిత విషయాలకు సంబంధించి మీ నిర్ణయాలను మార్చుకుంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు
మీ వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఐటీ ఉద్యోగులకు ఈరోజు మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.
మకరం
మీ ఇంట్లో ఆందోళనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీరు కార్యాలయంలో కొన్ని మార్పులు చేయవచ్చు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కుంభం
మీరు తలపెట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది.మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం
మీకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా మీరే తీసుకోండి.ఎవ్వరి మాటలకు ప్రభావితం కావొద్దు. శుభకార్యం కోసం షాపింగ్ చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. న్యాయపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది.