Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 17th)..ఆకస్మిక ధనలాభం పొందుతారు.
ఈ రోజు(2024 April 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
చేసేపనులను ధైర్య సాహసాలతో చేస్తారు. మీ ఆలోచనలే విజయాన్ని సాధించేలా చేస్తాయి. మీ పట్టుదలను ఇతరులు గుర్తిస్తారు. శత్రువులు స్నేహితులుగా మారుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సన్నిహితులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
వృషభం
శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధువులను కలుస్తారు. విదేశిప్రయత్నాలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.
మొదలుపెట్టిన కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతీ విషయంలో అభివృద్ధిలో దూసుకెళ్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు.
కర్కాటకం
మానసికంగా ఆనందంగా ఉంటారు. గతంలో వాయిదా వేయబడిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీమీ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం
విదేశయాన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. అనవసర వ్యయప్రయాసలకు వెళ్లవద్దు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.
కన్య
సన్నిహితులను కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు మొదలుపెడుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అందరితో స్నేహంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల
సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నూతనంగా ఏ పనులు చేపట్టరాదు. ఇంటిలో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం.
వృశ్చికం
ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు
కొన్నిముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
మకరం
ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఇంటిలో మార్పును కోరుకుంటారు. కొన్ని విమర్శలకు గురవుతారు. మనసు చంచలంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
ప్రయాణాలు అధికంగా చేస్తారు. తద్వారా లాభాన్ని పొందుతారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం జరిగే అవకాశం ఉంది. మొదలుపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
మీనం
నూతన వస్తు, ఆభరణాలను కొనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో మంచి ఆర్జిస్తారు. చెడువారితో స్నేహం చేయొద్దు. అన్ని విషయాల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు మెండుగా అందుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.