AP: భారీ వర్షాల కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇవాళ శ్రీవారి నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని TTD మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని అధికారులు రద్దు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.