ఎప్పటి నుంచో ఓ అమ్మాయిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని.. ఒక్కసారి ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న అతడికి పొలంలో ఆ అమ్మాయి ఒంటరిగా పని చేస్తుండడంతో వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు. అత్యాచార యత్నం చేయగా యువతి ప్రతిఘటించింది. ఎంతకీ వదలకపోవడంతో అతడి పెదవిని కొరికేసి రెండు ముక్కలు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మేరఠ్ జిల్లా ధారవుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మోహిత్ సైనీ ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను లొంగ దీసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అదును కోసం ఎదురుచూస్తుండగా.. ఆదివారం ఆ యువతి పొలంలో ఒంటరిగా పనులు చేస్తున్నది. ఇక ఇదే అదునుగా భావించి వెంటనే ఆ అమ్మాయిని వెనుక నుంచి వెళ్లి వాటేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ యువతి బెంబేలెత్తిపోయింది. కేకలు వేసేందుకు ప్రయత్నించగా నోటితో ఆమె నోరు మూసేలా గట్టిగా ముద్దు చేశాడు. ఆమెను బలంగా పట్టుకుని అత్యాచారం చేయాలని ప్రయత్నించాడు. యువతి ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో అతడు మళ్లీ ఆ యువతికి లిప్ లాక్ చేశాడు.
చాలా సేపు చేయడంతో ఆ యువతి ఇక తప్పించుకోవాలని భావించి అతడి పెదవిని చాలా గట్టిగా కొరికేసింది. ఆమె కొరకడంతో మోహిత్ పెదవి రెండు ముక్కలై కింద పడింది. తీవ్ర రక్తస్రావం, నొప్పికి తాళలేక మోహిత్ గట్టిగా అరిచాడు. సమీప రైతులు వచ్చి చూడగా పెదవి భాగం కిందపడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు పొలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పడి ఉన్న పెదవి భాగాన్ని కవర్లో వేసుకుని వెళ్లారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన ఆత్మరక్షణ కోసం అతడి పెదవి కొరికినట్లు బాధితురాలు తెలిపింది.