ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అంటూ బడ్జెట్ ప్రసంగం చేశారు. మొత్తం బడ్జెట్ రూ.2,90,396 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు ఉండగా.. మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లుగా మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,175’ అని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో చేశారు. ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
– నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
– విద్యుత్ శాఖకు రూ.12,727 కోట్లు
– ఆసరా ఫించన్లకు రూ.12 వేల కోట్లు
– దళిత బంధుకు రూ.17,700 కోట్లు
– ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
– ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
– మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
– ఆయిల్ పామ్ కు రూ.1000 కోట్లు