SRPT: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ఎస్పీ కార్యాలయ కానిస్టేబుళ్లు మోదుగు సురేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి మధుమోహన్ వెంటనే స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి రోగి ప్రాణాలను కాపాడారు. పలువురు అభినందించారు.