ఎన్నికల ఏడాది కావడం.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. అందరి మనన్నలు పొందే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీ కేటాయింపులు జరిపింది. గతంలో ఎన్నడూ లేనట్టు బాహుబలి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు రూ.3 లక్షల కోట్లకు రాష్ట్ర బడ్జెట్ చేరింది. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం చేశారు.