అక్రోన్కు చెందిన సిడ్నీ పావెల్ హెల్త్ కేర్ వర్కర్ అయిన బ్రెండా పావెల్ (Brenda Powell) (50) అత్యంత క్రూరమైన రీతిలో హత్యకు గురైంది.కాలేజీ నుంచి సస్పెండ్ అయినట్లు తన తల్లికి తెలియకూడదన్న ఆలోచనతో ఆమెను హత్య చేసిన కుమార్తె ఉదంతం ఇది. చంపడం కూడా సాధారణంగా కాకుండా ఇనుప పెనంతో పలుమార్లు బాది, కిచెన్ చాకు(knife)తో 30 సార్లు మెడపై కసాకసా పొడిచి హత్య చేసింది. అమెరికా (America) లో 2020లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి కోర్టు కుమార్తెను దోషిగా నిర్ధరించి శిక్ష వేసింది.ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో హెల్త్ కేర్ వర్కర్‌గా పనిచేసే బ్రెండా పావెల్ (50)ను తీవ్ర గాయాలపాలైన స్థితిలో మార్చి 2020లో పోలీసులు గుర్తించారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందారు.
పోలీసులు దర్యాప్తు చేయగా మృతురాలి కుమార్తె సిడ్నీ పావెల్(Sydney Powell)నే ఈ హత్య చేసిందని గుర్తించారు. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన సిడ్నీకి ఈ విషయం తల్లికి తెలిస్తే ఏమంటుందోనని ఆందోళన కలిగింది.దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంది. ముందుగా వంట గదిలోంచి ఇనుప పెనం, కత్తి తీసుకుని వచ్చి తల్లిపై దాడి చేసింది. ఆ రెండింటినీ మార్చి మార్చి వినియోగిస్తూ పాశవికంగా దాడి చేసింది. అయితే నిందితురాలు సిడ్నీ.. స్కిజోఫ్రీనియా (Schizophrenia) అనే మానసిక సమస్యతో బాధపడుతోందని.. హత్యకు తనని కారకురాలిగా భావించొద్దని కోర్టులో డిఫెన్స్ న్యాయవాదులు (Defense lawyers) వాదించారు. మానసికంగా అనారోగ్యం కలిగినందువల్లే అంతవరకూ స్నేహితురాలిగా భావించిన తల్లిని చంపిందని పేర్కొన్నారు.
అయితే ఈ వాదనను ప్రాసిక్యూషన్ (Prosecution) ఖండించింది. ఘటన జరిగే సమయానికి నిందితురాలికి అంత తీవ్రమైన మానసిక సమస్యలూ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితురాలు(Accused)ఆయుధాలను మార్చి మార్చి పాశవికంగా హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని,, ఇది ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహలో ఉండి చేసినట్లుగానే భావిస్తూ దోషిగా నిర్ధరిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న ఆమెకు శిక్ష ఖరారు చేయనున్నారు. పావెల్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతుందని,, అందువల్ల హత్యకు ఆమెను బాధ్యురాలిగా చెప్పలేమని డిఫెన్స్ వాదించింది. దీనిమీద ఆమెకు రోగనిర్ధారణ చేయడానికి ముగ్గురు డిఫెన్స్ నిపుణులను నియమించారు. వారిలో ఒకరైన జేమ్స్ రియర్డన్, సిడ్నీ(Sydney) తన బెస్ట్ ఫ్రెండ్‌గా భావించే తన తల్లిని చంపిన తరువాత మానసిక అసమతుల్యతకు గురయ్యిందని తెలిపారు.