»Telangana Medical Student Dies Of Heart Attack In Canada
Medido death: కెనడాలో గుండెపోటుతో వైద్య విద్యార్థిని మృతి
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
నిజామాబాద్ జిల్లా (nizamabad district) మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మల్కాపూర్ కు చెందిన వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు పూజితా రెడ్డి (Poojitha Reddy). పెద్ద కొడుకు కెనడాలో ఉన్నారు. పూజిత ఖమ్మంలోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ కోసం కెనడా వెళ్లారు. జనవరి 26వ తేదీన కెనడా వెళ్లిన ఆమె కొద్ది రోజులు తన సోదరుడి ఇంట్లో ఉండి, ఆ తర్వాత యూనివర్సిటీ హాస్టల్ లో చేరారు. పది రోజుల కిందట గుండెపోటుకు గురై హాస్టల్ గదిలో కుప్పకూలారు. స్నేహితులు, యాజమాన్యం ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించింది. చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోదరుడు ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.