Chennai College students fighting: వెళ్తున్న రైలును ఆపి కొట్టుకున్న విద్యార్థులు
తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారి మధ్య చర్చ కాస్త, ఘర్షణకు దారి తీసింది.
తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారి మధ్య చర్చ కాస్త, ఘర్షణకు దారి తీసింది.
నగరంలో తమదే గొప్ప కాలేజీ అంటే.. తమదే అని పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ వాదన పెరిగి, తిట్టుకోవడం, ఆ తర్వాత కొట్టుకునే స్థాయికి చేరుకుంది. వీరి తీరు ఎక్కడకు చేరుకున్నదంటే ఆ లోకల్ రైలును ఆపేసి మరీ, గొడవ పడ్డారు. చాకులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. రైలులోని ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని, గాయపడిన విద్యార్థులను హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై హాస్పిటల్ తరలించారు.