ట్రాఫిక్ రూల్స్(Trafic Rules) ఎన్ని తీసుకొచ్చినా రోడ్డు ప్రమాదాలు(Road Accidents) మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల(Road Accidents) సంఖ్య పెరుగుతోంది. తాజాగా చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం(11 Died) చెందారు. ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలోదా బజార్ జిల్లా, భాటపార రూరల్ పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల మేరకు..ఒక వ్యాన్(Van)లో కొంత మంది గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగొస్తుండగా ఆ వ్యాన్(Van)ను ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు(Truck) ఢీకొంది. ఖమారియా గ్రామం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం(Accident)లో గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్ పూర్ ఆస్పత్రి(Raipur Hospital)కి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయివారి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్ద మృతుల బంధువుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. 11 మంది మరణించడంతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది.