సంఘటనపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ తోచడం లేదు. కారు ట్రాక్టర్ ను ఢీకొట్టిందా? లేదా ట్రాక్టర్ పై ఉన్న జేసీబీ జారిపడి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది.
పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తెలుగులో 'ఝుమ్మంది నాదం' మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollyw...
పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బీజేపీ(BJP) నేతను నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్(Senthil kumar)ను విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన టీ తాగుతుండగా అంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి చేరుకున్నారు.
తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.
దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తును ఏర్పాటు చేశారు. కాగా దొంగ ఈ ఇంటిని రెక్కీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అదును చూసి చోరీకి పాల్పడ్డాడని తేలింది.
ఆకాంక్ష దూబే(Akanksha Dubey) 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో పుట్టింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకునేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య(Suicide)కు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్(Pawan Singh)తో కలిసి ఆమె నటించింది. ఆ పాటనే ఆకాంక్ష చివరిసారిగా పోస్...
ఎవరికీ అనుమానం రాకుండా కాంట్రాక్టు ఉద్యోగి గంగాధరం గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని రవాణా చేస్తుండటం చూసి అధికారులు షాక్ అయ్యారు. తిరుమల(Tirumala) కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ(TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాల విషయంలో సర్కార్ బాధ్యతగా వ...
Murder : దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే... ఓ చిలుక ఈ హత్య కేసులో నిందితులను పట్టించడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.
తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్... ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమెతో పాటు ఆమెకు సమీపంలో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.