»Tspsc Paper Leak Case Sit Submitted Report To Telangana High Court
TSPSC paper leak case: హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్
TSPSC పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC paper leak case)ను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం దర్యాప్తు రిపోర్టును హైకోర్టు(telangana High Court)కు సమర్పించింది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని దాఖలు చేసిన అంశంపై విచారణ జరిపి కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణం కేసు(TSPSC paper leak case)లో సిట్(SIT) తెలంగాణ హైకోర్టు(telangana High Court)కు మంగళవారం నివేదిక సమర్పించింది. మరోవైపు NSUI నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో సిట్ నెల రోజుల పాటు దర్యాప్తు చేసి 18 మందిలో 17 మందిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, అట్లు రాజశేఖర్, దాక్యా నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), గ్రూప్-1 ప్రిలిమినరీ, డీఏవో పరీక్ష పత్రాలను లీక్ చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు న్యూజిలాండ్ లో ఉన్న మరో నిందితుడి అరెస్టు కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు అడ్వొకేట్ జనరల్ ఈ కేసు విచారణ సరిగ్గానే జరిగిందని చెబుతుండగా..పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం ప్రభుత్వ జోక్యంతో జరిగిన ఈ సిట్ విచారణపై నమ్మకం లేదని తెలిపారు. ఏ జిల్లాలో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎలా తెలుస్తుంది? వీదేశీ లావాదేవీలు కూడా జరుగగా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని కోరారు. ఈ క్రమంలో ఇరు పార్టీల వాదనలు విన్నకోర్టు కేసును ఏప్రిల్ 24కు వాయిదా వేసింది.
మరోవైపు పేపర్ లీకేజీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించి అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకర్ లక్ష్మి సహా సంస్థ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కోణంలో ఈ కేసు దర్యాప్తు చేయాలని ఈడీ ఏజెన్సీ కూడా భావిస్తోంది. సిట్ అరెస్టు చేసిన నిందితులను తమకు అప్పగించాలని ఈడీ ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సెక్రటరీ, బోర్డు సభ్యుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లలో భద్రపరిచినట్లు తెలిపే ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా జత చేశారు.
ఈ కేసులో దాదాపు 150 మందిని విచారించగా పేపర్లలో 100కి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు, ఇతర అనుమానితులను కూడా విచారించారు. మహబూబ్ నగర్(mahabubnagar district) జిల్లాలో నిందితుల ఇళ్లలో రెండ్రోజులుగా దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించింది. మార్చి 11న బేగంబజార్ పోలీస్ స్టేషన్లో పేపర్ లీక్‌పై కేసు నమోదవగా, ఈ కేసు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కేసును సిట్‌కు బదిలీ చేశారు.