»Cheemalapadu Incident Ktr Puvvada Ajay Call On Injured Party Activists
KTR: చీమలపాడు బాధితులకు కేటీఆర్ పరామర్శ.. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా
చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
KTR:చీమలపాడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(NIMS Hospital) రాష్ట్ర మంత్రి కేటీఆర్(KTR) గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులకు ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్లు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్(Ajay Kumar) , ఎంపీలు నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) రవిచంద్రలతో కలిసి మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియా(Media)తో మాట్లాడారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తామన్నారు. మరో వైపు ఈ ప్రమాదంలో దివ్యాంగులుగా మారిన వారికి చేయూత అందిస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం, పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.చీమలపాడు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందో లేదా దర్యాప్తులో తేలుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.
చీమలపాడులో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలుడుకు గల కారణాలపై క్లూస్ టీమ్(Clues Team) ఆరా తీస్తుంది. ఐదు నిమిషాల ముందు సిలిండర్ పేలి ఉంటే ఇంకా ఎక్కువ మంది గాయపడి ఉండేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్రత కారణంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శరీర భాగాలు చిధ్రంగా మారాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్రత ఇంత ఎక్కువగా ఎందుకు ఉందనే విషయమై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలుడుకు ఏమైనా పేలుడు పదార్ధాలు దోహదపడ్డాయా అనే కోణంలో కూడా క్లూస్ టీమ్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నుల గురించి స్థానికులను క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తుంది.