గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుమల(Tirumala)లో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల(Tirumala) ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ లో సెబ్ అధికారులు 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Earthquake) వల్ల మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాలపైకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ (SR NAGAR) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కారు డ్రైవర్ (Car driver) రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. మాదాపూర్‌లోని మైహోం (Myhomes) భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు.
‘కితకితలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన గీతా సింగ్ కు అసలు వివాహం కాలేదు. కానీ ఆమె తన అన్న కుమారులను పెంచి పోషిస్తోంది. ఆమె అన్నయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల బాధ్యతను గీతా సింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇద్దరితో పాటు తన చుట్టాలమ్మాయిని కూడా పెంచుతోంది. అందరి ఆలనాపాలనా ఆమె చూసుకుంటున్నారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్‌లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు
పచ్చడి తయారు చేసే పరిశ్రమలో వీరంతా కార్మికులు. ఉదయం పని కోసమని ఆటోలో బయల్దేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో పొగమంచు కారణమో లేక వేరే ఏమో కానీ ఆటో బస్సు ఎదురెదురుగా వచ్చాయి. ఆటోను బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో ముందు భాగంగా నుజ్జనుజ్జయ్యింది.
కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.