మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి తెలుగు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ టి. వెంకట్‌రామ్‌రెడ్డి(Venkatrami Reddy)తోపాటు ప్రమోటర్లను కూడా ఈడి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ బౌద్థనగర్ డివిజన్ వారసిగూడలో మాసిక దివ్యాంగురాలిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అసహజ శృంగానికి బలవంతం చేస్తున్నారంటూ తెలంగాణ ఐఏఎస్‌పై ఆయన భార్య ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
ఓ కూతురు తన కన్నతల్లిని హత్య చేసింది. అత్తతో గొడవ పడుతోందని పేగు తెంచుకొని జన్మించిన కూతురు.. కర్కశంగా తన తల్లిని హత్య చేసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత గడ్డ క్రైవీ రిహ్ లక్ష్యంగా క్షిపణులతో దాడికి తెగబడింది రష్యా.
బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్‌కి వచ్చినట్లు తెలిసింది. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్యం విషమించి ఈరోజు హైదరాబాద్లో కన్నుముశారు.
ఢీల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ తీహార్ జైలులో లొంగిపోయారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ (Jabardast) కమెడియన్ హరి పేరు తెరపైకి వచ్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్‌ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.