Hyderabad Bazarghat: హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లో గల ఓ అపార్ట్ మెంట్లో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు మంటలు చేలరేగాయి. అపార్ట్ మెంట్ సెల్లార్లో ఆయిల్ రీ సైక్లింగ్ గ్యారేజ్ ఉంది. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మంది ఊపిరి ఆడక మృతిచెందారు. ఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నాయి. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది 15 మందిని కాపాడారు. ప్రమాదంతో ఆ బిల్డింగ్ స్వరూపం మారి పోయింది. టూ వీలర్, కారు తగలబడిన విజువల్స్‌లో కనిపించింది.
ప్రమాదం జరిగిన భవనం జీ ప్లస్ నాలుగు అంతస్తులు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాదం జరగగా క్రమంగా మంటలు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. అపార్ట్ మెంట్లో 70 మంది వరకు నివసిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయిల్ రీ సైక్లింగ్ గ్యారేజ్ వద్దని యజమాని జైస్వాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. అతని నిర్లక్ష్యం పలువురి ప్రాణాలను బలి తీసుకుంది. జనావాసాల మధ్య ఆయిల్ రీ సైక్లింగ్ ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డీజిల్ డ్రమ్ములు పేలడంతోనే ప్రమాదం జరిగిందని డీసీపీ వెంకటేశ్వర్లు చెబుతున్నారు.