బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్‌లో సజీవ దహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు కంటైనర్లు ఢీకొనడం వల్ల ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులతో కలిసి ఓ మహిళ మిడ్ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ క్రమంలో నలుగురు మృత్యువాత చెందారు. వారిలో తల్లి రజిత, పిల్లలు అయాన్(7), అసరజా(5), ఉస్మాన్(14 నెలలు)ను పోలీసులు గుర్తించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి. కొన్నేళ్ల క్రితం మహ్మద్ అలీని రజిత లవ్ మ్యారేజ్ చేసుకుంది.
కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారు వేగంగా నడపడం వల్ల ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
సముద్రంలోని టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్మెర్సిబుల్ అంతర్గత విస్ఫోటనం చెందింది. తాజాగా టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు.
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఈ కుంభకోణంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్‌తో పాటుగా రైల్వే, పోలీసు అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో విచారణను ప్రారంభించారు.