సికింద్రాబాద్ ఎస్‌డీ రోడ్డులోని తాజ్‌మహాల్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఏ విషయంపైనైనా సరే.. సమాచారంతో వార్త రాయాలని మీడియా ప్రతినిధులను డీజీపీ కోరారు. లేదంటే ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.
లైంగిక ఆరోపణల కేసులో తమిళనాడు (Tamil Nadu) డీజీపీ రాజేష్ దాస్‌ను స్థానిక న్యాయస్థానం దోషిగా తేల్చింది
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మణిపూర్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరారు.
తిరుపతిలో ఓ ఫోటో ప్రేమ్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి చనిపోయాడు.
హైదరాబాద్‌లో మరో నకిలీ మహిళా కానిస్టేబుల్ గుట్టురట్టయింది
గ్రీస్‌లో ఓడ మునక ఘటనలో 79 మంది చనిపోయారు. 104 మందిని కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విశాఖలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. అతని భార్య జ్యోతి, కొడుకు చందుతోపాటు అతని సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును కొంతమంది అపహరించారు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగరంలో లేని క్రమంలో ఆనందపురంలోని కుమారుని వద్దకు వెల్లే సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా జ్య...
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ(Basara iiit)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటివల విద్యార్థిని దీపిక ఆత్మహత్య ఘటన మరవక ముందే..మరో విద్యార్థిని మృతి చెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది.
కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లి కుమారుడు వడదెబ్బ(sunstroke) కారణంగా మృత్యువాత చెందాడు. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో లారీ ట్రక్కు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన హైదరాబాద్ కు చెందిన యువతి హత్యకు గురైంది.
ఏలూరు విద్యానగర్లో దారుణం జరిగింది. ఓ వివాహితపై పలువురు దుండగులు నిన్న రాత్రి యాసిడ్ దాడి చేశారు. రాత్రి ఆ మహిళ స్కూటిపై వెళుతుండగా దుండగులు ఆపి ముఖంపై దాడి చేశారు. బైక్ ను ఆపి యాసిడ్ చల్లి గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె స్థానిక డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిష్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను మ...