»Six Died In Car And Truck Collision At Barmer Rajasthan
Accident: కారు, ట్రక్కు ఢీ..ఆరుగురు మృతి
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా ఓ వ్యక్తితో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందారు.
six died in car and truck collision at barmer rajasthan
రాజస్థాన్(rajasthan)లోని బార్మర్(barmer)లోని ధోరిమన పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం(road accident) జరిగింది. ఓ కారు, ట్రక్కు వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో సహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Rajasthan | Six people, including five members of the same family, died in a collision between a car and a trailer vehicle in Dhorimana Police Station limits of Barmer. pic.twitter.com/QoNF9gu5R8
అయితే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ధనరాజ్ (45), స్వరాంజలి (5), ప్రశాంత్ (5), భాగ్యలక్ష్మి (1), గాయత్రి (26) ఉన్నట్లు గుర్తించామని ధోరిమన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుఖరామ్ విష్ణోయ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కారులో ఉన్నవారు మహారాష్ట్రలోని భాల్గావ్ వాసులని..వారు జైసల్మేర్ వెళుతున్నట్లు స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధోరిమన్న ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామని వెల్లడించారు.
మరోవైపు ఈరోజు పంజాబ్(punjab)లోని లూథియానా జిల్లాలో ఉదయం పొగమంచు కారణంగా 100కు పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఇందులో ఒకరు మృతి చెందారు. కాగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.