Gun Shooting : అమెరికాలో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
అగ్రరాజ్యం అమెరికా(USA)లో మళ్లీ కాల్పుల మోత(Shooting) మోగింది. న్యూ హంప్‌షైర్(New Hampshire)లోని కాంకర్డ్ నగరంలో ఉన్న సైకియాట్రిక్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు.ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి బుల్లెట్ గాయాలు అయినట్లు సమాచారం.
అమెరికా(USA)లోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. కాంకర్డ్ నగరంలోని సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’ వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హాస్పిటల్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ దుండగుడిని హతమార్చామని వివరించారు. కాల్పుల (Shooting) సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని హాస్పిటల్ లాబీలో దాక్కున్న షూటర్ని కాల్చి చంపారని పోలీసుల (Police) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి సాధారణంగా ఉందని, ఎలాంటి ఆందోళనలేదని పోలీసులు వివరించారు. కాగా పోలీసుల చేతుల్లో హతమైన వ్యక్తి ఎవరనేది ఇప్పటివరకు గుర్తించలేదని, అతడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నట్టు వివరించారు. కాగా న్యూ హాంప్‌షైర్ (New Hampshire) హాస్పిటల్ మానసిక వైద్యశాల అని తెలిపారు. ఈ హాస్పిటల్‌కు వచ్చేవారు మెటల్ డిటెక్టర్ల గుండా వెళ్లాల్సి ఉంటుందని, ఒక పోలీసు అధికారి విధిలో ఉంటారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది