ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...
విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.
రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్‌స్టర్లు అతడిని కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు.
బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు బాలికలు సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది.
తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.
జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.
పబ్లిక్‌లో న్యూసెన్స్ చేయడంపై యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు.
మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
విశాఖ కిడ్నీ రాకెట్ కేసు(Vizag Kidney Rocket Case)లో ఓ వైద్యుడు సహా ఆరుగురు దళారులను పోలీసులు అరెస్ట్(6 members Arrest) చేసినట్లు వెల్లడించారు.
ఏపీలోని రాజమహేంద్రవరం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే భవానీ(MLA Bhavani) భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్స్ విషయాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నెల రోజుల క్రితమే ఆదిరెడ్డి శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్(mp bharath)...
పంజాబ్(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మరోవైపు...