»A Training Helicopter Crashed On The Outskirts Of Toopran Municipality
Aircraft Crashes: తూప్రాన్ మున్సిపాలిటీ శివారులో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరు మృతి
సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి శివార్లలో కూలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Aircraft Crashes: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. భారీగా శబ్దం రావడంతో గమనించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. కిందపడిన వెంటనే మంటలు చేలరేగి హెలికాప్టర్ మొత్తం కాలిపోయింది. ఇది దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చెందిన శిక్షణ హెలికాప్టర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పైలట్, ట్రైనీ పైలట్ మంటల్లో కాలిపోయి సజీవదహనం అయ్యారు.