హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నుంచి ఒట్టావాకు పారిపోయిన పంజాబ్ వాసిని బుధవారం దుండగులు కాల్చి చంపారు.
సెల్‌ఫోన్ యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అత్యాచార కేసులు ఇప్పటి వరకూ పెద్దవారిపై నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ 7 ఏళ్ల బాలుడు 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
డ్రగ్స్ కేసులో భాగంగా హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు.
ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారే రోడ్లపై బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నేటిజనుల ముందు పోలీసులు నవ్వుల పాలు అవుతున్నారు.
ఇండోబంగ్లాదేశ్ సరిహద్దులో గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను BSF జవాన్లు చేధించారు. ఆ క్రమంలో ఇద్దరిని పట్టుకుని వారి నుంచి ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓ బాలిక ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం కేసు పెట్టింది. దీని ఆధారంగా పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ డీసీపీ తెలిపారు.
తమిళ్ హీరో విజయ్ ఆంటోని నివాసంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తన 17 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత గమనించిన హీరో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొండలు లేదా జలపాతలు లేదా ఆయా ప్రదేశాల వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెెప్పలేం. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. టూర్ కోసం వెళ్లిన పర్యటకుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత చెందారు.
ఆస్పత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ చుసినా కామాంధులే తయారయ్యారు. గతంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఏకంగా హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసులకు తెలుపడంతో బహిర్గతమైంది.
భాగ్యనగరం(hyderabad)లో ఫేక్ సర్టిఫికెట్లు(Fake certificates) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి అనేక యూనివర్సిటీలకు చెందిన ద్రువపత్రాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.