దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న క్రమంలో హకీంపేట వద్ద ఇది చోటుచేసుకుంది.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబం...
మణిపూర్ లో అల్లర్లు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం జరిపిన దుండగుల దాడిలో ఖొయిజుమన్ తాబి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ వ్యాలెంటీర్లు మరణించారు.
నిజామాబాద్ సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రీకొడుకులు. తండ్రి మరణించాడని తెలియక రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి సృహతప్పి పడిపోయిన బాలుడు(child). స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (Tadipatri CI) ఆనందరావు(ananda rao) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ మహిళ(women) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
అనూరిజం వ్యాధితో యూట్యూబ్ ఫిట్‌నెస్ స్టార్ జోస్తెటిక్స్ మృతి
బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.