ఉత్తరాఖండ్‌లో ప్రయాణిస్తున్న ఓ కారుపై అనుకోకుండా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృత్యువాత చెందారు.
ఏపీలోని తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ప్రత్యక్షమై ఓ చిన్నారిపై దాడి చేసింది. దీంతో చిన్నారి మృత్యువాత చెందింది.
నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా మంది చదువుల ఒత్తిడి భరించలేకనో, ర్యాంగింగ్ బారినపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని కాలేజీలో బైపీసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వరదలకు చైనాలో 29 మంది మృతిచెందారు. గత నెలలో కూడా వరదల వల్ల 33 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రజలు తీవ్ర నష్టాలతో తల్లడిల్లుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.
డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన హ్యర్యానా గురుగ్రామ్‌లో జరిగింది. పరిచయం అయిన వ్యక్తి హోటల్‌కు పిలిచి తినే పదార్థంలో మత్తు కలిపాడు. తన స్నేహితుడు ఇద్దరు కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు.
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
మహిళా ప్రయాణికురాలి మీద ఉబర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.
హవాయి ద్వీపాలలో ఒకటైన మౌవీ ఐలాండ్‌లో మొదలైన కార్చిచ్చుకు కనీసం 36మంది చనిపోయారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
విశాఖ జిల్లా పరవాడ ఎన్టీపీసీలో నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది.
తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై ఓ మహిళ కాల్పులు జరిపింది
ఆపద అంటే ఆరున్నర లక్షలను అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి తనకు అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, కుటుంబంతో సహా వెళ్లి అతని ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు.
భార్యభర్తల గొడవలు మాములే అని అంటారు. కానీ క్షణికావేశంలో జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తన భార్య కాపురానికి రావట్లేదని ఓ భర్త తన అత్తగారింటికి నిప్పు పెట్టాడు. తర్వాత ఏమైందో మీరు చూసేయండి మరి.