బ్రెజిల్(brazil)లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఓ ప్రయాణీకుల విమానం శనివారం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న మొత్తం 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో చిన్నారులకు ఏదైనా వ్యాధి వస్తే చాలు వెంటనే గుర్తుకొచ్చేది నిలోఫర్ హాస్పిటల్. అలాంటిది ఈ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం చిన్నారులకు భద్రత లేకుండా పోయింది. తాజాగా ఓ ఆరు నెలల బాబు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఓ మహిళ ఎత్తుకుంటానని తీసుకుని ఏకంగా ఎత్తుకెళ్లింది.
వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వాహనం ప్రమాదవశాత్తు ఆగిఉన్న పాల వ్యానును ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషాదఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ...
ఐఐఐటీ చదివిన ఓ విద్యార్థి హ్యాకింగ్ నేర్చుకున్నాడు. తన హ్యాకింగ్ నైపుణ్యంతో ఓ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డు పాయింట్లను దోచేశాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నారని, బేబీ సినిమాలోని దృశ్యాలే స్పాట్ లో కనిపించాయని తెలిపారు. బేబీ మేకర్స్‌కు నోటీసులు ఇవ్వనున్నామన్నారు.
లిబియాలో తుఫాను వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో భారీ వరదల కారణంగా 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు 30 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్లోని(Jammu and Kashmir) అనంత్‌నాగ్(anantnag district)లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో(encounter) ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు, ఒక పోలీసు అధికారి మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రైల్వే చీఫ్ మేనేజర్, 1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్ (IRSS) అధికారి కెసి జోషిని సిబిఐ అరెస్టు చేసింది. 3 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.
అర్ధరాత్రి 11.30 గంటలకు ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృత్యువాత చెందగా.. 25మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.
ఓ రైతు తన పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆవులు, మేకలకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాడు. అలాంటి ఓ రైతు ఆవును పులి చంపి తినేసింది. దీంతో ఆ రైతు పగతో రగిలిపోయాడు. ఆ రైతు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు.