ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని విశ్వవిద్యాలయ వ్యాయామశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..40 మందికిపైగా గాయపడినట్లు అక్కడి మీడియా నివేదించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఒడిశాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కియోంఝర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో నిండిన వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఏపీలోని కాకినాడ తీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మత్య్సకారులను కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇరాక్‌లోని తూర్పు దియాలా ప్రావిన్స్‌లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్‌పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.
జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.