Delhi Police has arrested the person who made Rashmika's deep fake video
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాను(Social Media) కుదిపేసింది. తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికిి ఆ వీడియోలో కనిపించే ఒరిజినల్ ఫేస్ బ్రిటీష్ ఇండియన్ ఇన్ఫ్ల్యూయేన్సర్ జరా పటేల్‌కు చెందినది. ఆ ఏఐ డీప్ ఫేక్(Deep Fake) టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేశారు. అది నెట్టింట్లో వైరల్ కావడంతో పలువురు సెలబ్రెటీలు స్పందించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
సదరు వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 465, 469, ఐటీ సెక్షన్లు 66సీ, 66ఈ ల కింద కేసుల పెట్టారు. అదే సమయంలో కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా సచిన్ టెండుల్కర్, ప్రియాంక చోప్ర వీడియోలను ఫేక్ చేసి నకిలీ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకున్నారు. దీనిపై కూడా వారు స్పందించారు. తాజాగా సోనూసూద్ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ కావడం విశేషం. ఈ డీప్ ఫేక్ వీడియోల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.