»Fog And Hit Cars In Delhi Body Parts Into Pieces On The Road
Road accident: దూసుకెళ్లిన కార్లు.. రోడ్డుపై ముక్కలుగా శరీర భాగాలు
పొగమంచు కప్పేస్తోంది. రోడ్లపై వాహనాలు ఢీ కొట్టుకుంటున్నాయి. ఒక వ్యక్తిని ఏ వాహనం డ్యాష్ ఇచ్చిందో తెలియదు, ఎన్నికార్లు అతనిపై వెళ్లాయో తెలియదు, అతని బాడీ పార్ట్స్ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Fog and hit cars in Delhi. Body parts into pieces on the road
Road accident: చలికాలం పొగమంచు ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోడ్లపై ప్రయాణించే కార్లు ఢీ కొట్టుకున్న సంఘటనలు ఎన్నో చూశాము. ఈ సీజన్లో కూడా పొగమంచు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ(Delhi)లో ఒక హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి(Road accident) గురైన వ్యక్తిని ఎవరు గుర్తించలేదు. వాహనదారులు వేగంగా మృతుడిపై వెళ్లడంతో శరీర భాగాలు తెగి పడ్డాయి. మృతుడి భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. బాధితుడు ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో మొహం రోడ్డుకి అతుక్కపోయింది.
ఎన్‌హెచ్9(NH9) సమీపంలో ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రహదారులను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చారు. బాధితుడి కొన్ని భాగాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మర్టానికి పంపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పొగమంచు వలన అన్ని వాహనాలను గుర్తించడం కష్టంగా ఉంది. సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా ఒక వాహనం ఢీ కొట్టింది. తరువాత చాలా వాహనాలు అతని బాడీ మీదగా వెళ్ళాయి. దాంతో ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రథమిక దర్యాప్తులో వెల్లడించారు.