Tamilisa Sounder Rajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సైందర్ రాజన్(Tamilisa Sounder Rajan)కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌కు గురయింది. మంగళవారం తన ఖాతా నుంచి సంబంధం లేని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. రాజభవన్ వర్గాలు వాటిని గుర్తించిన వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశారు. దాంతో సైబర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. గవర్నర్ ఖాతాను హ్యాకింగ్ చేసిన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌ను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పలువురి ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి.