అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆ దందా ద్వారా సుమారు రూ.350 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బర్త్ డే పార్టీలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 40 ఫైర్ ఇంజిన్లు, 12 ఎమెర్జెన్సీ వాహనాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు గట్టి షాక్ తగిలింది. దాదాపు 18 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లో చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు పడిపోతున్నారు. తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్లను దోచుకున్న కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఏకంగా 2 కోట్లకుపైగా పెట్టెల్లో దాచిన క్యాష్ తోపాటు బంగారం కూడా వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు సమీపంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృత్యువాత చెందగా..మరో 130 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఓ జంతు శాస్త్రవేత్త దారుణానికి ఒడిగట్టాడు. కుక్కలను అత్యాచారం చేసి వాటిని వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. అతని వీడియోలు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడికి డిసెంబర్లో శిక్ష ఖరారు కానుంది.
ఓ వ్యక్తి రూ.20 కోసం బాలికను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పాన్ మసాల తీసుకురమ్మంటే ఆ బాలిక చిప్స్ ప్యాకెట్ కొనుక్కుందని ఆగ్రహంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.