»A Army Jawan Lost His Life Due To Chines Manja Kites Thread
China Manja : పండుగ పూట విషాదం.. జవాన్ ప్రాణం తీసిన మాంజా
దేశమంతటా సంక్రాంతి సందడి నెలకొంది. రంగురంగుల గాలిపటాలన్నీ ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో పంతంగి మాంజ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్మీ అధికారి మెడపై చైనా మాంజా తగిలి గొంతు కోసింది.
China Manja : దేశమంతటా సంక్రాంతి సందడి నెలకొంది. రంగురంగుల గాలిపటాలన్నీ ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో పంతంగి మాంజ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్మీ అధికారి మెడపై చైనా మాంజా తగిలి గొంతు కోసింది. చికిత్స పొందుతూ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లంగర్ హౌస్ ఇన్ స్పెక్టర్ నిరంజన్ రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కహిగల కోటేశ్వరరావు లంగర్ హౌజ్ లోని మిలటరీ ఆస్పత్రిలో నాయక్ గా పనిచేస్తున్నాడు.
కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి లంగర్‌హౌస్‌లోని బాపునగర్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి విధులు ముగించుకుని కోటేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా లంగర్ హౌస్ ఫ్లై ఓవర్‌పై మాంజా దారం అకస్మాత్తుగా మెడకు తగిలింది. దీంతో మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ తప్పి పడిపోయిన కోటేశ్వరరావును స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. కోటేశ్వరరావు మృతదేహాన్ని ఆర్మీ అధికారులు సందర్శించి నివాళులర్పించారు. విశాఖపట్నంలో కోటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.