cocaine: ముంబై విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. అక్రమంగా కొకైన్ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్ మహిళను అధికారులు ముంబై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని పరిశీలించగా.. తెల్లటి పొడి లాంటి పదార్థాలు గల కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్లో బయటపడ్డాయి. వీటిని పరీక్షించగా కొకైన్ అని తేలింది. అయితే అధికారులు పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారుగా రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆ మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Maharashtra | A 21-year-old woman of Thailand nationality was arrested at Mumbai airport and cocaine worth Rs 40 crores in the international market was seized from her luggage. She was arrested under NDPS Act. The woman had travelled from Addis Ababa: Directorate of Revenue…