»Misdemeanors Of Guntur Nallapadu Constable Wife Caught Police Red Handed
Viral News: పోలీసులంతా కామాంధులేనా?..అడ్డంగా దొరికిన మరో అధికారి
అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత మంది పోలీసులు తమ వికృత చేష్టలను బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని లోబరుచుకుంటారు. అలాంటి ఓ పోలీసు చీకటి కోణాన్ని తన భార్య బయటపెట్టి అతను అరెస్టు అయ్యేలా చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Viral News: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు అవినీతి పరులు, కామంధులు కూడా ఉన్నారు. వారు చేసే కొన్ని పనుల వలన పోలీసు(Police) వ్యవస్థకే చెడ్డపేరు వచ్చేలా ఉంది. పలువురు అవినీతి చేస్తూ డిపార్ట్మెంట్కు మచ్చ తీసుకొస్తుంటే.. మరికొందరు స్త్రీలోలుగా మారి వ్యవస్థ పరువు తీస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు గుర్తుకు రావాల్సింది పోయి.. పోలీసులతో ఏ ఆపద వస్తుందోననే భయం ప్రజల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు(Guntur) జిల్లాలో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అక్కడి ప్రజలు ఛీ అంటున్నారు.
జిల్లాలోని నల్లపాడు(Nallapadu) పోలీస్ స్టేషన్లో కత్తి శ్రీను అనే కానిస్టేబుల్(Constable) మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న భార్య అతన్ని వారించింది. అయినా అతను వినలేదు. చేసేది ఏం లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. డిపార్టులో పనిచేస్తుండంతో సదరు పోలీసులు వ్యక్తిగతంగా మందలిస్తామని భార్యకు సంజాయిషీ ఇచ్చారు. అయినా అతను మారలేదు. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా ఆమె రెడ్ హ్యండెడ్‌గా అతన్ని పట్టుకుని పోలీసులకు పట్టించింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. తనకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఘటనే ఆ మధ్య హైదరాబాద్‌లో కూడా చోటు చేసుకుంది. గౌరవమైన పోలీస్ వ్యవస్థలో ఉండి ఇలా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.