హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా..మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
కరాచీ బేకరీలోని కిచెన్లో అనుకోకుండా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడగా..మరో 9 మంది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు ఎలా జరిగిందనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ..పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది.