»Another Twist In The Drug Case Narcotics Bureau Searches The House Of Hero Navdeep
Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
డ్రగ్స్ కేసులో భాగంగా హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు గతంలోనే తెలిపారు. అయితే నవదీప్ హైకోర్టు నుంచి స్టే తీసుకురావడంతో పోలీసుల సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు చేయడంతో మరోసారి ఈ కేసు చర్చనీయాంశమైంది.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి తన వాంగ్మూలంలో నవదీప్ గురించి కీలక విషయాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్లు రామ్ చంద్ తెలిపాడని, అందుకే డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందిడుతిగా చేర్చామని టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు చేయగా ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు..నవదీప్‌ను సెప్టెంబర్ 19వ తేది వరకూ అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్ బ్యూరో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది.
ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ జరగ్గా పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 13 మందిని నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో నవదీప్‌ను కూడా అరెస్ట్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.