ఓ కుటుంబంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్లు(Sisters) బాగా చదివేవారు. తల్లిదండ్రులు కూడా వారిని బాగా చదివించారు. చదువు అయ్యాక ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. జాబ్ వచ్చాక ఆ అక్కాచెల్లెళ్లు వేర్వేరు యువకులను ప్రేమించారు. వారి ప్రేమ విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియడంతో వారు తమ కూతుర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రేమకు అడ్డు చెప్పారని మనోవేదనతో ఆ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
గాయత్రి, విద్య అనే అక్కాచెల్లెళ్లు బాగా చదివేవారు. ఇంట్లో ఆర్థిక సమస్యల రీత్యా వారు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. దీంతో తిరుప్పూర్‌లోని ఓ టెక్స్టైల్స్ మిల్లులో ఇద్దరూ పనికి కుదిరారు. చాలా కాలంగా అక్కడే పనిచేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆ అక్కాచెల్లెళ్లు మరో మతానికి చెందిన యువకులను ప్రేమించారు. తల్లిదండ్రులకు వారి ప్రేమ వ్యవహారం తెలియకుండా సీక్రెట్‌గా మెయింటెన్ చేస్తూ వచ్చారు.
ఈ మధ్యనే వారి ప్రేమ విషయంలో తల్లిదండ్రులకు తెలిసింది. కోపంతో ఊగిపోయిన వారు తమ కూతుర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో కూతుర్లు మనోవేదనకు గురయ్యారు. వారి ప్రేమకు అడ్డు చెప్పారని చనిపోవాలనుకున్నారు. అందులో భాగంగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ స్థానికంగా ఉండే బావిలోకి దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు స్థానికులు సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.