Hyderabad: హైదరాబాద్‌లో ఓ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని (student) సూసైడ్ చేసుకుంది. తమ కూతురి మృతికి కారణం క్షుద్రపూజలు కారణమని ఆమె పేరంట్స్ (parents) అంటున్నారు. ఘటనపై పోలీసులు (police) కేసు నమోదు చేశారు. విద్యార్థిని (student) మృతి స్థానికంగా కలకలం రేపింది.
కుల్సుంపుర పరిధిలో గల భరత్ నగర్‌కు (bharath nagar) చెందిన నవ్య (navya) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమె నిన్న రాత్రి 7.30 గంటలకు ఆత్మహత్య చేసుకుంది. గత నాలుగు రోజుల నుంచి క్షుద్రపూజలు చేస్తున్నారని ఆమె పేరంట్స్ (parents) అంటున్నారు. తమ ఇంటి ముందు నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళుతున్నారని వివరించారు. అలా చేయడం వల్లే కూతురు సూసైడ్ చేసుకుని ఉంటుందని అంటున్నారు.
నవ్య చక్కగా చదువుకునేదట. పదో తరగతి (ssc), ఇంటర్ ఫస్ట్ ఇయర్లో (inter first year) మంచి మార్కులు సంపాదించింది. ఇంతలో ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో అంతా షాక్ అయ్యారు. తమ కూతురి చావుకి క్షుద్రపూజలే కారణం అయి ఉంటాయని అంటుండగా.. ఈ కాలంలో అలా ఏమీ ఉండదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.