జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ఇటువంటి నేరాలను నివారించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దేశ భద్రతకు కూడా పలు యాప్ (Apps)ల నుంచి ముప్పు ఉండటంతో వాటిపై కేంద్రం దృష్టిసారించింది. తాజాగా 14 మొబైల్ మెసెంజర్ యాప్(Mobile Messenger Apps)లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆ యాప్‌లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు(Terrorists) ఆ మొబైల్ మెసెంజర్ యాప్‌లను వినియోగిస్తున్నారని కేంద్రం తెలిపింది.
ఉగ్రవాదుల(Terrorists)కు ఈ మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps) ద్వారా పాక్ నుంచి సందేశాలు వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. నిషేధించిన యాప్‌లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్ఆర్ఎంఈ, మీడియాఫైర్, బ్రియర్, బీచాట్, నాండ్ బాక్స్, కొనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, త్రీమా యాప్‌లను నిషేధిస్తూ(Apps Banned) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు ఈ 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. కొన్ని పరిశోధనా సంస్థలు కూడా ఈ విషయాన్ని బయటపెట్టాయి. దీంతో కేంద్రం ఈ యాప్‌లపై నిషేధాన్ని విధించింది. అయితే నిషేధించిన యాప్ డెవలపర్లు భారత్‌లో లేరని, ఇతర దేశాల నుంచి ఆ యాప్‌లను ఆపరేట్ చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. గతంలో కూడా చైనాకు చెందిన 250 వరకూ యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.