NZB: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడులపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
SRPT: రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ. 125 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లను రాష్ట్ర హోజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యల వారీగా వివరించారు. అలాగే అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు అభివృద్ధికి కావలసిన ప్రణాళిక రూపొందించుకొని త్వరితగతంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
PDPL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సుల్తానాబాద్ పట్టణంలో 99 మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
NRPT: ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం స్థానిక వార్డు సభ్యులు సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం వండకపోవడం, నాణ్యత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
GDWL: 70 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పక్షపాత వైఖరికి నిదర్శనం అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం గద్వాల ఎంఆర్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.
MNCL: రాబోయే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి తీసుకురావడం వరకు భద్రత కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
SDPT: సదాశివపేట మండలం సూరారం గ్రామ శివారులోని గంగకత్వ కాలువలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. మృతుడు కోహిర్ మండలం కొత్తూరు(డి) గ్రామానికి చెందిన గొల్ల గోపాల్ (35)గా గుర్తించారు. ఈ నెల 22 మిస్సైన గోపాల్.. ఇవాళ శవమై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KNR: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు శాలువాలు కప్పి సన్మానించారు.
NGKL: జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో ఎస్సై మాధవరెడ్డి వాహనదారులకు మంగళవారం ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సిగ్నల్స్ పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
MDK: ఉమ్మడి జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌గా కె.వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఇంఛార్జ్ డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు.. పదోన్నతి కల్పిస్తూ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం తన నూతన బాధ్యతలను చేపట్టారు.
NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల రాష్ట్ర మహాసభ ఈనెల 28న వరంగల్‌లో జరగనున్నట్లు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మెడికల్ కాంటాక్ట్ కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NRML: కుబీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరిడెంట్ విజయ్ భాస్కర్, DO నర్సయ్య తెలిపారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం జనరల్ 132, ఒకేషనల్ 27 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 112 మంది విద్యార్థులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు.
MBNR: జిల్లాలో SSC,ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.
SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్‌ను అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధితో ఆశీర్వదించారన్నారు.