• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కుమ్మెర ఘటనపై జప్తినాచారంలో కొవ్వొత్తుల నిరసన

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులను నిరసిస్తూ జప్తినాచారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో DSP నేత శ్రీకాంత్,గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 27, 2026 / 07:30 AM IST

సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ : SI

ADB: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో గురువారం రాణాదివ్వే నగర్ కాలనీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.

February 27, 2026 / 07:30 AM IST

మావో అగ్రనేత ‘బుక్క సత్తన్న’ ఎక్కడ..?

KNR: మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు పర్వం కొనసాగుతున్న వేళ.. పాతతరం విప్లవకారుడు దేవరకొండ సత్యనారాయణ అలియాస్ ‘బుక్క సత్తన్న’ ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకి చెందిన సత్తన్న, తండ్రి మరణం తర్వాత తల్లితో HZB మండలం చెల్పూర్ చేరారు. ఈ క్రమంలో PDPLలో ITI చదివి, 1975లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదు.

February 27, 2026 / 07:30 AM IST

మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన IRFRC

HYD: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFRC) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్‌సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

February 27, 2026 / 07:26 AM IST

కల్లెడలో గుడుంబా విక్రయం.. మహిళ అరెస్టు

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన ఎండీ.నూరమ్మ వద్ద సుమారు నాలుగు లీటర్ల గుడుంబా లభ్యమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 27, 2026 / 07:26 AM IST

ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!

ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్కోట్-మహబూబ్ నగర్)ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి.మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులకు తెలిపారు.

February 27, 2026 / 07:25 AM IST

‘బాధితుల ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం’

KMM: భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తిస్తున్నామని, అసలైన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూదాన్ స్థలాన్ని మోసపూరితంగా అమ్మినవారు జైల్లో ఉంటారని తెలిపారు.

February 27, 2026 / 07:23 AM IST

రామయ్యను దర్శించుకున్న కలెక్టర్

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నిన్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో దామోదర్ రావు కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో రామయ్యకు ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్‌కు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

February 27, 2026 / 07:19 AM IST

ఏడుపాయల ఆలయం మూసివేత

MDK: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ ముగిశాక 6 గంటల నుంచి ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ రోజున అన్ని రకాల పూజలు, సేవలను నిలిపివేస్తామన్నారు. తిరిగి మార్చి 4న బుధవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 07:16 AM IST

‘హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి’

MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 27, 2026 / 07:13 AM IST

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం”యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు.

February 27, 2026 / 07:10 AM IST

నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు

RR: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామంలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ తెలిపారు. జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షల రూపాయలతో కొడిచెర్ల రోడ్డు పక్కన గల అండర్ గ్రౌండ్ సంపు నుంచి ట్యాంకు వరకు పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 07:10 AM IST

చిన్నారి మృతికి కొవ్వొత్తులతో నివాళులు

JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకులస్తుల దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ జగ కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

February 27, 2026 / 07:06 AM IST

మంచినీటి బోరు మోటర్ ప్రారంభించిన: కౌన్సిలర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డులో వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా MLA దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానందులు సహకారంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి బోరు మోటర్‌ను నిన్న సాయంత్రం కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

February 27, 2026 / 07:06 AM IST

వెలుగుమట్ల బాధితులకు ఎంపీ రవిచంద్ర భోజనాలు

KMM: భూదాన్ బోర్డు భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెలు నిరాశ్రయులైన బాధితులకు గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులు భోజనాలు లేక అలమటిస్తున్న తరుణంలో ఘటనా స్థలిలో భోజనాలు ఏర్పాటు చేసిన ఎంపీకు ఋణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 07:05 AM IST