• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్టిజన్ కార్మికుల ఆందోళన

MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు విధులను బహిష్కరించారు. జేఏసీ పిలుపు మేరకు విధులను బహిష్కరించిన ఆర్టిజన్ కార్మికులు తూప్రాన్ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం డిమాండ్లపై దిగి రాకుంటే సమ్మెను ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ స్వామి, కన్వీనర్ ఎస్కే షాదుల్ హుస్సేన్ పాల్గొన్నారు.

April 8, 2026 / 04:30 PM IST

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

HNK: ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సన్ ప్రీత్ సింగ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో పని చేసే అధికారుల, సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలని తెలిపారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

April 8, 2026 / 04:28 PM IST

‘మున్నేరుకు కాలేశ్వరం నీటిని విడుదల చేయాలి’

BDK: కాలేశ్వరం నీళ్లు మున్నేరు శాఖలకు విడుదల చేసి ఎండి పోతున్న పంటలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంత పంట పొలాలను పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యవసాయానికి కాలేశ్వరం నీళ్లు ఇల్లందు బయ్యారం, గార్ల, కురవి, డోర్నకల్ మండలాలకు అందించాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 04:27 PM IST

విద్యార్థులకు HIV అవగాహన పోటీలు

WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు HIV అవగాహనపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కీర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో హెచ్ఐవి అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

April 8, 2026 / 04:24 PM IST

కరీంపేటలో పోషకాహార దినోత్సవం

KNR: శంకరపట్నం మండలం కరీంపేట ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం గ్రామీణ పోషకాహార దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ ఎగ్గని శ్రీలత మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు. ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేశం, ఏఎన్ఎం మల్లిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

April 8, 2026 / 04:23 PM IST

మున్సిపల్ కోఆప్షన్ అభ్యర్థుల పేర్ల ప్రకటన

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మునిసిపాలిటీలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ-అశోక్ కుమార్, ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ తైసిన్ హజీ, తోగిటి నరసింహ చారి, క్రిస్టియన్ మైనారిటీ చెందిన నక్క జాకబ్‌ల పేర్లను వారు ప్రకటించారు.

April 8, 2026 / 04:21 PM IST

శిశు మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

WNP: జిల్లాలో మాత శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీల్లో రక్తహీనత ఉన్న వారిని గుర్తించి వారికి ముందస్తుగా పోషకాహారం అందించి, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

April 8, 2026 / 04:18 PM IST

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

SDPT: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మి బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజలతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండే ఆమె మరణం పట్ల గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

April 8, 2026 / 04:17 PM IST

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

JGL: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో రూ.12 లక్షలు, చర్లపల్లిలో రూ.5 లక్షలు, రంగసాగర్లో రూ.4 లక్షలు, కండ్లపల్లిలో రూ.7.50 లక్షలు, కమ్మునూరులో రూ.5 లక్షలు, తుంగూరులో రూ.9 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.

April 8, 2026 / 04:17 PM IST

రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని వినతి

RR: కోళ్ల పడకల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సాయి మహాలక్ష్మి రైస్ మిల్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, విషవాయువుల కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పంట పొలాల్లో పంటలు నాశనమయ్యే అవకాశం ఉందని, రాబోయే రోజులలో త్రాగునీరు కూడా కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చేపంగి ప్రవీణ్‌కు గ్రామస్తులు వినతి పత్రం అందచేశారు.

April 8, 2026 / 04:16 PM IST

ఘనంగా నూతన సీఐకి సన్మానం

MHBD: గూడూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వినయ్ కుమార్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా స్థానిక BRS నాయకులు బుధవారం సీఐని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సీఐ కోరారు. మాజీ ZPTC మహమ్మద్ ఖాసీం, జలగం సంపత్ రావు, మాజీ MPTC కిషన్, తదితరులున్నారు.

April 8, 2026 / 04:16 PM IST

జిల్లా అధ్యక్షుని పెళ్లి వేడుకకు హాజరైన మాజీ మంత్రి

JN: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన జిల్లా యువజన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గజ్జి సంతోష్ కుమార్ వివాహ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

April 8, 2026 / 04:15 PM IST

ఉట్నూర్ మండల సర్పంచులతో ఎమ్మెల్యే సమావేశం

ADB: ఉట్నూర్ మండల సర్పంచులతో ముఖ్య సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరగగా, నూతన సర్పంచులకు గ్రామాల అబివృద్ధి కొరకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దిశ నిర్దేశం చేశారు. వేసవిలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులతో కలిసి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. అవసరం ఉన్న చోట బోర్వెల్స్ సాంక్షన్ చేస్తా అని హామీ ఇచ్చారు.

April 8, 2026 / 04:13 PM IST

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ASF: లింగాపూర్ మండలం రైతు వేదికలో MLA కోవ లక్ష్మి 54 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం అందించిన రూ. లక్ష మాత్రమే అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఎక్కడని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

April 8, 2026 / 04:06 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం’

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని TPCC జాయింట్ కన్వీనర్ స్వామి అన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామ 6వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డు పనులకు సర్పంచ్ సాయికిరణ్ తో కలిసి భూమిపూజ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

April 8, 2026 / 04:05 PM IST