VKB: పరిగి మండలం రాపోల్ గ్రామస్తులు తమ భూములు లాక్కుని ప్రభుత్వం ఇండస్ట్రీయల్‌కు అప్పగించవద్దంటూ బుధవారం ధర్నా చేశారు. పరిగి-షాద్‌నగర్ రహదారిపై బైఠాయించిన రైతుల నిరసనతో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సమదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
ADB: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాలు ‘బ్లాక్ డే’ నిర్వహించాయి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన హోరెత్తించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు.
KNR: ఐతుపల్లి గ్రామంలోని చర్ల హనుమాన్ దేవాలయానికి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు కలిసి సుమారు రూ. 50 వేల విలువైన మకర తోరణాన్ని బహూకరించారు. భక్తుల చందాలతో తయారు చేయించిన ఈ తోరణాన్ని బుధవారం స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SRCL: శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని *పోలీస్ యాక్ట్ 1861* ప్రకారం నెల రోజులు *(ఏప్రిల్ 1వ తేది నుంచి 30 తేదీ వరకు)* జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరదన్నారు.
SRD: కంగ్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గురువారం ప్రజా పాలన – ప్రణాళికపై 99 రోజుల ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరు తమ తమ గ్రామ పంచాయతీలలో గ్రామస్తులకు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
SRD: జిల్లా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జాప్యంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 117 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసినా.. ఇప్పటివరకు తుది నియామకాలు చేపట్టలేదు. ప్రతిరోజూ కార్యా లయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
MBNR: కేంద్రం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ చౌరస్తాలో CITU, INTUC తదితర సంఘాలు నిరసన తెలిపాయి. 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని CITU జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.
JGL:పేదల వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని 32వ వార్డుకు చెందిన కోనపురం సత్తమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసరమైన వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు.
హన్మకొండలోని ములుగు రోడ్డు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) ప్రాంగణంలో ఏప్రిల్ 2వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ చందర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో నిర్ణీత సమయంలోగా వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
SRD: మునిపల్లి మండలం మేళాసంఘం గ్రామానికి చెందిన పడమటి పర్వయ్య కు CMRF ద్వారా మంజూరైన రూ.18000 చెక్కును ఎమ్మెల్సీ అంజిరెడ్డి లబ్ధిదారునికి నేడు అందజేశారు. పేదల ఆసుపత్రి ఖర్చులకు సీఎంఆర్ ఎంతో ఆసరా అవుతున్నదని ఆయన పేర్కొన్నారు. దీన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ దండి లక్ష్మీ అధ్యక్షతన 13వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో, డ్రైనేజీలలో చెత్త వేయకూడదని సూచించారు.
MBNR: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ అప్పయ్య హెచ్చరించారు. బెట్టింగ్‌ల వల్ల యువత జీవితాలు నాశనమవుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్రమ బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
MNCL: కోటపల్లి మండలం నాగంపేట్లో జరిగిన ప్రమాదంలో తాళ్ల బాపు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ఆసుపత్రికి తరలించారు.
VKB: పరిగి మండలం రంగంపల్లిలో బుధవారం పద్మమ్మ (65)అనుమానాస్పద స్థితిలో రక్తపు మాడుగులో మృతి చెందింది. మృతురాలి భర్త ASIగా పనిచేస్తూ పదవి విరమణ పొంది అనారోగ్యంతో చనిపోయాడు. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామంలో కొంత కాలంగా నివసిస్తోంది. ముఖంపై, ఛాతిపై గాయల మాదిరిగా ఉండడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
PDPL: రూ.వేల కోట్లతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక MLA- MS రాజ్ ఠాకూర్పై BRS నాయకుడు కౌశిక హరి ఆరోపణలు చేస్తున్నారని నగర మేయర్ మహంకాళి స్వామి మండిపడ్డారు. MLA క్యాంపు ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. MLAపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కౌశిక హరి అక్రమ దంధాలు చేస్తున్నాడన్నారు.