• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇంటి పన్ను వసూలు కోసం వెళ్తే సిబ్బందిపై స్థానికుల దాడి

WGL: వరంగల్ నగరంలోని కొత్తవాడలో ఇంటి పన్ను వసూలు కోసం వచ్చిన మున్సిపల్ సిబ్బందిపై బుధవారం స్థానికులు దాడి చేశారు. బొట్ల శ్రవణ్, అతని తండ్రి ఆశీర్వాదం ఇంటి పన్నుకు రూ.12,000 బకాయిలు చెల్లించాలని కోరగా, సిబ్బందిపై ఆగ్రహంతో విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని దూషించడం, మరో మున్సిపల్ ఉద్యోగిపై భౌతిక దాడి చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 26, 2026 / 07:18 AM IST

నేడు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

కామారెడ్డి: జిల్లాలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డాక్టర్ శ్రీలేఖ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. కావున డోంగ్లి పీహెచ్సీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఫోన్ తీసుకురావాలన్నారు.

March 26, 2026 / 07:16 AM IST

పన్ను చెల్లించని వారి ఆస్తులను సీజ్ చేసిన అధికారులు

యాదాద్రి: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం గాను ఆస్తి పన్నులు వసూళ్ళలో భాగంగా గత సంవత్సరం,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, బకాయి అస్థి పన్ను చెల్లించని వారికి వారంలో చెల్లించవలసినదిగా తెలియజేస్తూ రెడ్ నోటీసు ఇవ్వడం జరిగింది.  అయినా కూడా పన్ను చెల్లించకపోవడంతో  వారి ఆస్తులను ఆలేరు మున్సిపాలిటీ సిబ్బంది సీజ్ చేశారు.

March 26, 2026 / 07:15 AM IST

కుళ్లిన గుడ్లతో కప్ కేక్స్

HYD: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కాటెదాన్‌లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కప్ కేకులు తయారు చేస్తున్న ఈ ముఠా అక్రమాలను మెరుపు దాడిలో గుర్తించారు. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తుంది.

March 26, 2026 / 07:15 AM IST

వదంతులు నమ్మొద్దు: ఎస్పీ

నల్గొండ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల కారణంగా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నింపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. కృత్తిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 26, 2026 / 07:14 AM IST

చెర్వు అన్నారంలో కోతుల దాడి.. మహిళకు తీవ్ర గాయాలు

NLG: కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. బుధవారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో పని చేసుకుంటున్న కోనేటి ఎల్లమ్మ అనే మహిళపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 26, 2026 / 07:11 AM IST

పెట్రోల్ బంక్ పనులను పరిశీలించిన అదనపు ఎస్పీ

MDK: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆవుసులపల్లి పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బంక్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

March 26, 2026 / 07:11 AM IST

99 రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

VKB: జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయికి చేరవేయాలని సూచించారు.

March 26, 2026 / 07:11 AM IST

దివంగత ఎస్సై చంద్రశేఖరకు ఘన నివాళి

KNR: ఇటీవల అకాల మరణం చెందిన ఎస్సై చంద్రశేఖర్ స్మారకార్థం జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం సంతాప సభ నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. చంద్రశేఖర్ సేవలను గుర్తుచేసుకున్న సీపీ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:11 AM IST

జిల్లాలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

KMR: జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. KMR (ZPHS బాయ్స్), పిట్లం ( ZPHS), ఎల్లారెడ్డి(GHS ), బాన్సువాడ(GHS) ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను ఇందుకు ఎంపిక చేశారు. దీంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి రానున్నాయి

March 26, 2026 / 07:08 AM IST

భీమ్‌గల్ మున్సిపల్ బడ్జెట్‌కు ఆమోదం

నిజామాబాద్: భీమ్‌గల్ పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.31.44 కోట్ల అంచనా బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఛైర్‌పర్సన్ నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ గంగాధర్ వివరాలు వెల్లడించారు. ఆదాయంలో ప్రభుత్వ గ్రాంట్లు రూ.27.77 కోట్లు కాగా, సొంత వనరులు రూ.3.61 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో నుంచి వివిధ పౌర సేవలు, నిర్వహణ కోసం రూ.2.94 కోట్లు కేటాయించారు.

March 26, 2026 / 07:05 AM IST

‘సమ్మక్క హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’

ASF: పెంచికల్ పేట్ మండలంలో జరిగిన ఆదివాసీ యువతి సమ్మక్క హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య, బాధితురాలి కుటుంబ సభ్యులు రాష్ట్ర SC,ST కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెంకటయ్య అన్నారు.

March 26, 2026 / 07:04 AM IST

‘ఉచిత ఇసుకను ఇతర పనులకు ఉపయోగిస్తే కఠిన చర్యలు’

ASF: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అందించే ఉచిత ఇసుకను ఇతర పనులకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. కెరమెరి మండలంలోని అనార్పల్లి X రోడ్డు వద్ద ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపి రసీదులను పరిశీలించారు. అనంతరం RDO లోకేశ్వర్ రావు, జైనూర్, కెరమెరి MROలకు సమాచారం ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 26, 2026 / 06:58 AM IST

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

MNCL: జన్నారం మండలంలోని అక్కపల్లి గూడ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి పంపిస్తున్నారు. మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాముఖ కమలాకర్, జాజాల శ్రీనివాస్ వెళ్ళనున్నారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆయన ఫిన్లాండ్‌లో అధ్యయనం చేయనున్నారు.

March 26, 2026 / 06:58 AM IST

బైక్‌ను ఢీ కొట్టిన లారీ యువకుడు మృతి

HNK: ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు వర్ధన్నపేట పట్టణానికి చెందిన గొల్లంపల్లి అరుణ్ (26) గుర్తించారు మృతుడు వరంగల్‌లో ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

March 26, 2026 / 06:55 AM IST