BHPL: మండల కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ సమీపంలో లారీ అసోసియేషన్ వద్ద భారీ డీజిల్ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్ దొంగిలించినట్లు అధ్యక్షుడు దానవేణ రమేష్ తెలిపారు. ఈ ఘటనతో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
JN: రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజు యాదవ్ అన్నారు. నర్మెట్టలో నిర్వహించిన రైతు సంబరాలకు రైతులతో కలిసి ఛైర్మన్ హాజరయ్యారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.
ADB: ఈనెల 27వ తేదీ నుంచి కందుల కొనుగోలును కేంద్ర ప్రభుత్వ సంస్థ నాపేడ్ పూర్తిగా నిలిపివేసినట్లు ఆదిలాబాద్ మార్క్‌పెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి ఆదివారం తెలియజేశారు. ఈనెల 26వ తేదీ వరకు రైతులు తమ కంది పంటను మార్కెట్ యార్డు తీసుకురావాలని సూచించారు. జిల్లా రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని ప్రవీణ్ రెడ్డి కోరారు.
PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక రెండవ విడతలో భాగంగా ఈనెల 25న కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారిణి సల్మా బేగం తెలిపారు. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఎముకల, కంటి, పిల్లల, పంటి వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
NLG: నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని రాజవరం మేజర్ చివరి భూములకు (టేల్ ఎండ్) సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. రాజవరం, తిరుమలగిరి సహా ఐదు గ్రామాల్లోని 500 ఎకరాల వరి పొలాలు నెర్రెలు వారుతున్నాయి. కాలువల్లో కంపచెట్లు పెరిగి, తూములు సరిగా లేక నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సాగునీరు అందించాలన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో దీపక్ అనే యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. నిందితులు భీమిని సంజీవ్, సీడం దీపక్ వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
KMM: ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం క్యాష్‌లెస్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టిందని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల బారిన పడినప్పుడు ఉద్యోగులకు రూ.1.2 కోట్ల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేశామన్నారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు అందిస్తుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఇది గొప్ప అవకాశం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కళ్యాణి యాదగిరి పాల్గొన్నారు.
JGL: మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 30న నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు జిల్లా వెంకటేశ్వర్లు, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల భానుమూర్తిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24న నామినేషన్ల స్వీకారణ, 25న స్క్రూటీని, 26న విత్ డ్రా, ఫైనల్ లిస్ట్ ఉంటుందన్నారు. 30న బార్ అసోసియేషన్ గదిలో ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
MDCL: అల్వాల్ పట్టణ పరిధి టెంపుల్ అల్వాలోని హరిదాస మండపంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ 75వ వసంత వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం తులసి అర్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మిరియంపల్లి వరుణ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తులసి అర్చనలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
NRPT: కృష్ణ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుడెబల్లూర్ శివారులో ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై ఏఎస్సై యాదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా రాజనగరం చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో మత్స్యకారులకు భారీ నష్టం వాటిల్లింది. చేపలు కుళ్లిపోవడంతో వెలువడుతున్న తీవ్ర దుర్వాసన వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యం లేదా ఆక్సిజన్ లేమి వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
SDPT: నంగునూర్ మండలం నర్మేట గ్రామంలో దేశంలోని ఒక పెద్ద అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు, సతీష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ 300 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీని తీసుకువచ్చి రైతుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారన్నారు.
MDK: తోగుట మండలం వరదరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి సోదరుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతునికి నివాళులు అర్పించరు. అనంతరం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తారని అనడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న మధ్యాహ్న భోజనంపై ఇలా మాట్లాడడం దుర్మార్గమన్నారు.