• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కూలి మృతి

NLG: చిట్యాల మండలం వెలిమినేడులో భవన నిర్మాణ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీ నారాయణ చంద్ర రాయ్(43) మృతి చెందాడు. ఒక కంపెనీలో గోడ పని చేస్తూ 12 అడుగుల ఎత్తు నుంచి కింద పడటంతో తలకు ఇనుప రాడ్ గుచ్చుకుంది. నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడని ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడి తండ్రి బిమల్ చంద్ర ఇవాళ ఫిర్యాదు చేశారు.

March 18, 2026 / 05:25 PM IST

‘సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

JN: ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలంలోని రంగాపురం, లక్ష్మక్కపల్లి గ్రామాల ముఖ్య నేతలతో ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

March 18, 2026 / 05:24 PM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు MLA కేఆర్ నాగరాజు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. “శ్రీ పరాభవ నామ సంవత్సర” ఉగాది పర్వదినం ప్రతిఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, కష్టాలు తొలగి ఆనందమయ జీవితానికి నాంది కావాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

March 18, 2026 / 05:23 PM IST

ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు: కలెక్టర్

HNK: యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండలో వరి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో దాన్యం డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, గన్నీ సంచులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

March 18, 2026 / 05:21 PM IST

ఆలయ నిర్మాణానికి విరాళం

VKB: యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, కొడంగల్ 7వ వార్డు కౌన్సిలర్ యం.కృష్ణంరాజు ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ. 25 వేల చెక్కును మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

March 18, 2026 / 05:20 PM IST

వాక్సినేషన్ డ్రైవ్‌ను పరిశీలించిన రాష్ట్ర బృందం

KMR: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్య శాఖ పరిశీలకులు బుధవారం సందర్శించారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు వేసిన టీకాలపై ఆరా తీశారు. రికార్డులను సైతం పరిశీలించారు. HPV టీకాలపై బాలికలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పాఠశాలలోని యాజమాన్యాలను కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

March 18, 2026 / 05:18 PM IST

మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: MLA

JN: రాష్ట్రవ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశకు చేరుకుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

March 18, 2026 / 05:15 PM IST

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన చిన్నారెడ్డి

WNP: మదనాపురం మండలం దంతనూరు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న ప్రజావాణిలో ఉండడంవల్ల రాలేకపోయానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్ణయ్య చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

March 18, 2026 / 05:13 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

MLG: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా MLG జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి సీతక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

March 18, 2026 / 05:13 PM IST

‘ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’

PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-11వ బొగ్గు గనిలో ఖాళీగా ఉన్న టైం రేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గుర్తింపు కార్మిక సంఘం (AITUC) నాయకులు గని మేనేజర్ మల్లేశంకు వినతి పత్రం ఇచ్చారు. నాయకులు నాయిని శంకర్ మాట్లాడుతూ.. యాజమాన్యం ముందుగా అంగీకరించి, తర్వాత నిర్లక్ష్యం చేస్తుందన్నారు. త్వరగా నోటీస్ బోర్డు ద్వారా ప్రకటించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు.

March 18, 2026 / 05:12 PM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు

WNP: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన పెబ్బేరు మండలం 44 జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదంలో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు వచ్చాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

March 18, 2026 / 05:07 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీపీ

కరీంనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ‘స్టాటిక్ ఫోర్స్’తో భద్రత కల్పించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.

March 18, 2026 / 05:03 PM IST

‘రైతు భరోసాను వెంటనే జమ చేయాలి’

SRPT: రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పంటల బీమా అమలు చేయాలని, యూరియా యాప్‌ ఇబ్బందులను తొలగించాలని నేతలు కోరారు. మొంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.

March 18, 2026 / 05:03 PM IST

పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరు

సిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన పదవ పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో 7308 మందికి గాను 7297 మంది హాజరయ్యారన్నారు. మొత్తం జిల్లాలో హాజరు 99.85 శాతంగా నమోదు అయిందన్నారు.

March 18, 2026 / 05:03 PM IST

‘మోత్కూర్‌లో ఉగాది పండుగకి సర్వం సిద్ధం’

BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అమ్మవారి దేవాలయాల్లో ఉగాది ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న, కమిషనర్ సతీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టణంలో ఉగాది అతిపెద్ద పండుగ అని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ జరుపుకోవాలని కోరారు.

March 18, 2026 / 05:02 PM IST