• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దశావతారాలతో ఆకట్టుకున్నచిన్నారులు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన దశావతార వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణుమూర్తి పది రూపాలను ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో కళకళలాడింది. చిన్నారుల ప్రతిభను చూసి భక్తులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 08:30 PM IST

‘వన్ టైం రిజిస్ట్రేషన్ గడువు మరో పది రోజులు పొడిగించాలి’

NLG: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు విధించారని ఆ యొక్క గడువును మరో 10 రోజులు పొడగించాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరో పది రోజులు గడువు పెంచాలని కోరారు.

February 23, 2026 / 08:30 PM IST

48 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదన.. అభినందించిన ఎస్పీ

KMR: ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో ఇనుప పెట్టెలో దాచిన సుమారు 40 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.16 లక్షల నగదును దొంగిలించిన కిలాడీ దొంగల జంటను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

February 23, 2026 / 08:30 PM IST

శంకరపట్నం మండల కేంద్రంలో ధర్నా

KNR: నాగర్ కర్నూల్లోని కొమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఓ పసికందు మృతికి నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో రజక సంఘం, బీసీ సంఘాల ధర్నా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన అగ్రకుల నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్ర వర్ణాల ఆగడాలను ఖండించారు. బీసీ సంఘం, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

February 23, 2026 / 08:29 PM IST

‘జాతీయ స్థాయిలోనూ రాణించాలి’

WGL: సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ సన్ ప్రీత్ సింగ్ క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పతకాలు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించగలమన్నారు.

February 23, 2026 / 08:28 PM IST

రేపు మహమ్మదాపూర్‌కు మంత్రి రాక

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.

February 23, 2026 / 08:24 PM IST

వీరభద్ర స్వామికి భక్తుల పవళింపు సేవ

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దేవత మూర్తులకు అర్చకులు పవళింపుసేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌తో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:21 PM IST

నానో ఎరువులపై రైతులకు అవగాహన

JGL: రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, ప్రకృతి వ్యవసాయం నానో ఎరువుల వినియోగంపై సోమవారం మండలంలోని ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ధర్మపురి, పెగడపల్లి ఏవోలు రాజకుమార్ శ్రీకాంత్ పాల్గొని సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.

February 23, 2026 / 08:19 PM IST

అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇందులో 48 భూ సమస్యలే ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 08:18 PM IST

విద్యార్థుల పురుగులు అన్నం ఎలా తినాలి:PDSU

GDWL: తక్కశిల బడిలో ప్రతిరోజూ విద్యార్థుల కంచంలో పురుగులు దర్శనమిస్తున్నాయి అని పిడిఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు ఈ నరకాన్ని అనుభవిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. పేద పిల్లల ఆకలిని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.

February 23, 2026 / 08:16 PM IST

‘కప్పం కట్టడం వల్లే సీఎం పోస్టింగ్, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్’

NZB: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి క్రమం తప్పకుండా డిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడం వల్లే ఆయన సీఎం పోస్టింగ్ ఉందని, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్ అయి ఉండేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

February 23, 2026 / 08:16 PM IST

గోవులను తరలిస్తున్న వాహనం స్వాధీనం.. కేసు నమోదు

NLG: కోదాడ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని (TS 29 T 3458) చిట్యాల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 9 ఆవులను కబేళాకు తరలిస్తున్న డ్రైవర్ షేక్ జానీ పాషా, యజమాని వేముల అనిల్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించారు.

February 23, 2026 / 08:15 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

SRCL: ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్దం చేశారు. పరీక్ష సమయానికంటే విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లోకి నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి ప్రవేశం ఉందన్నారు.

February 23, 2026 / 08:15 PM IST

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

PDPL: హైదరాబాద్లో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన సీఎం కప్’వుషు’,కిక్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో శ్రావ్యంజలి, సిరి చందన, అనన్య, శ్రావ్య, రాజ్కుమార్ పతకాలు సాధించారు. విజేతలను జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్, కోచ్ రాజుమార్ తదితరులు అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 23, 2026 / 08:14 PM IST

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

MDCL: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం HMT నగర్ డివిజన్ పరిధిలో సామాజిక కార్యకర్త భావన గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

February 23, 2026 / 08:11 PM IST