• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు

WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:13 AM IST

బాల్యవివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

HYD: బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. 18 ఏళ్లలోపు యువతులకు, 21 ఏళ్లలోపు యువకులకు పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందికి వస్తుందన్నారు.

February 24, 2026 / 10:12 AM IST

ఓవైపు పార్కింగ్.. మరోవైపు పాడుబడ్డ బండ్లు..?

MDCL: KPHB 4వ ఫేజ్ దేవాలయ సముదాయాల ప్రధాన రహదారిలో ఓవైపు వాహనాలు, మరోవైపు గోడల పక్కన పాడుబడ్డ బండ్లు ఉండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నట్లుగా పలువురు వాహనదారులు వాపోయారు. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 10:11 AM IST

‘విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు’

MNCL: వేసవి దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి రాజన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పలు ఉపకేంద్రాల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు.

February 24, 2026 / 10:06 AM IST

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం వచ్చిన ఆదాయం వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.79,862, ప్రసాదాల ద్వారా రూ.59,080, అన్నదానం ద్వారా రూ.14,044 ఆదాయం లభించింది. మొత్తంగా రూ.1,53,986 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

February 24, 2026 / 10:06 AM IST

మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి: AITUC

ADB: మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. వేతనాలు రాక కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేతనాలు చెల్లించని పక్షంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:04 AM IST

మహేశ్వరంలో యాక్సిడెంట్.. చిన్నారి మృతి

RR: మహేశ్వరం PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలుయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న వాహనాన్ని తొలిగిస్తున్నారు.

February 24, 2026 / 10:04 AM IST

విద్యుత్ తీగలకు తగిలి నీల్‌గాయి మృతి

ASF: పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు నీలుగాయి మృతి చెందినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా SI అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాకేశ్ శవ పంచనామ నిర్వహించారు. అనంతరం ఖననం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

February 24, 2026 / 10:03 AM IST

బాసర ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామరావు

NRML: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజనీదేవి సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేసిన అనుభవం ఉండటంతో ఆలయ వ్యవహారాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

February 24, 2026 / 10:02 AM IST

గోదావరి జలాల పెంపు

SRPT: జిల్లాకు ఎస్సారెస్పీ రెండోదశ ద్వారా ఇస్తున్న గోదావరి జలాలను సోమవారం సాయంత్రం పెంచారు.1200 క్యూసెక్కులు ఇస్తుండగా వాటిని 1613 క్యూసెక్కులకు పెంచారు. 4వ తడిగా వదులుతున్న గోదావరి జలాలను వారబందీ విధానంలో వారం రోజుల పాటు ఇవ్వనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణ, జాజిరెడ్డిగూడెం ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.

February 24, 2026 / 10:01 AM IST

నాగర్ కర్నూల్ ఘటన.. ఎస్పీ కీలక ప్రకటన

NGKL: కుమ్మెర జాతరలో చిన్నారి మృతికి కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. నిందితుల్లో సర్పంచ్ తుకారాం రెడ్డి సహా ఐదుగురు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 24, 2026 / 09:45 AM IST

కామారెడ్డి జిల్లాలో వర్షపాతం ఎలా ఉందంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట్ 17.8మి.మీ, తాడ్వాయి 13, ఆల్గొండ 12, రామలక్ష్మణపల్లి 11.3, లచ్చపేట 9.3, పాత రాజంపేట 7.8, దోమకొండ 7.3, భిక్కనూరు 5, జుక్కల్ 4.8, రామారెడ్డి 2.3 మి.మీ ల అత్యధిక వర్షపాతం నమోదయ్యాయి. కాగా అత్యల్ప ఉష్ణోగ్రత మేనూరు 17.4°C లో రికార్డు అయ్యాయి.

February 24, 2026 / 09:44 AM IST

కుమ్మెర జాతరలో అగ్రకుల దాడి

NRPT: డా.బీఆర్.అంబేద్కర్ యువజన సంఘం నేతలు మక్తల్లో నిరసన చేశారు. కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకులం చాకలి కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసిపాపను చంపారని మండిపడ్డారు. కులవాదులపై కఠిన చర్యలుతీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. తర్వాత చిన్నారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

February 24, 2026 / 09:40 AM IST

ఫార్మసీలో ఉద్యోగ అవకాశాలు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (కొత్తది)లో ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. SSC, D/B/M.Pharm అర్హత గల 18-35 ఏళ్ల అభ్యర్థులు 100 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు.

February 24, 2026 / 09:40 AM IST

జిల్లాలో ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు

BDK: బూర్గంపాడు పోలీసులు ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో భద్రాచలం టౌన్ ఎస్సైగా పనిచేసిన మహేష్, అతని తమ్ముడు ఎస్సై రాణాప్రతాప్‌పై ఈ చర్య తీసుకున్నారు. వ్యాపారం పేరుతో 35 శాతం అధికంగా చెల్లిస్తామంటూ కుమారి అనే మహిళ వద్ద రూ. 1.82 కోట్ల మొత్తం తీసుకుని మోసగించారనే అభియోగంపై ఆ ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 09:40 AM IST